Sunday, August 21, 2016


~ ఎడబాటు ~

మన ఈ ప్రణయ ప్రయాణంలో
చిన్న తడబాటు..
ఫలితంగ మన మధ్య
పెద్ద ఎడబాటు..

భారంగా ఉన్నా, భాధగా ఉన్నా
ఈ దూరం మనకి కానీ, మన మనసులకి కాదని..
బరువుగ భరిస్తున్నా..

Saturday, July 16, 2016


~ కన్నుల భాష ~

నిన్నే పిలుస్తున్నాను
నేను.. నిన్నే పలకరిస్తున్నాను..

వివరం కాదా..
వినబడలేదా..

కోటి భావాలా నా కన్నుల భాష..

Sunday, June 26, 2016


~ ఎప్పుడు ~

ఎప్పుడు పుట్టిందొ తెలియదు
జీవ నదిలా ప్రవహిస్తొంది..

ఎక్కడ మొదలైందొ తెలియదు
మహ నదిలా ముంచెస్తొంది ..

నీ మీద
నాకున్న ప్రేమ..

Saturday, June 25, 2016


~ తీపి గుర్తులు ~


గడచిన కాలన్ని
కళ్ళ ముందు చూపే
జ్ఞపకాల గడపల పచ్చని తొరణాలు..
తీపి గుర్తులు..